భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన ‘యూపీఐ’ ఉచిత సేవల విధానంలో.. త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. “పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం”కి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. దీని ప్రకారం భవిష్యత్తులో ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై.. వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడానికి చట్టపరమైన అనుమతి లభిస్తుంది.
అయితే, ఇప్పటికిప్పుడు సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించలేదు. కేవలం భవిష్యత్తులో అవసరమైతే రుసుములు వసూలు చేసేందుకు వీలుగా ఒక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మాత్రమే ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పుల వల్ల వినియోగదారులు..
ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, 2 వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై.. 0.3% నుంచి 0.5% వరకు MDR విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే, ఏడాదికి 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న బడా వ్యాపారులకు మాత్రమే..
ఈ నిబంధన వర్తింపజేసే అవకాశం ఉంది. మీ ఇంటి పక్కన ఉండే కిరాణా కొట్టు, టీ కొట్టు, చిన్న షాపుల యజమానులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అలాగే లావాదేవీల విలువను బట్టి కాకుండా… వ్యాపారి వార్షిక ఆదాయాన్ని బట్టి కూడా ఈ ఛార్జీలను నిర్ణయించే మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.


